అనంతపురంలో బుల్లెట్ల తయారీ పరిశ్రమ
Sakshi Education
రక్షణ రంగంలో వినియోగించే బుల్లెట్ల (తూటాలు) తయారీ కేంద్రాన్ని స్టంప్ షూలీ అండ్ సోమప్ప స్ప్రింగ్స్ (ఎస్‌ఎస్‌ఎస్ స్ప్రింగ్స్) సంస్థ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటుచేయనుంది.
రూ.580 కోట్లతో అనంతపురం జిల్లాలో ఈ యూనిట్‌ను ఆ సంస్థ ఏర్పాటుచేయనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి ఫిబ్రవరి 9న తెలిపారు. లక్నోలో జరిగిన డిఫెన్స్ ఎక్స్‌పో సందర్భంగా ఎస్‌ఎస్‌ఎస్ కంపెనీ ప్రతినిధులతో చర్చలు జరిపామని.. మూడు నెలల్లో నిర్మాణ పనులు ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పరిశ్రమల శాఖ అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుల్లెట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : ఎస్‌ఎస్‌ఎస్ స్ప్రింగ్స్ సంస్థ
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : బుల్లెట్ల తయారీ పరిశ్రమ ఏర్పాటు
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : ఎస్‌ఎస్‌ఎస్ స్ప్రింగ్స్ సంస్థ
ఎక్కడ : అనంతపురం, ఆంధ్రప్రదేశ్
Published date : 10 Feb 2020 05:50PM