అనంతపురంలో బస్సుల తయారీ యూనిట్
Sakshi Education
అనంతపురం జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటు కానుందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.
ఈ మేరకు ‘వీర వాహన ఉద్యోగ్ లిమిటెడ్’తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు నవంబర్ 21న వెల్లడించారు. వీర వాహన లిమిటెడ్ ఏటా 3,000 బస్సుల తయారీ సామర్థ్యంతో, రూ.1,000 కోట్ల పెట్టుబడి అంచనాతో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయనుందని పేర్కొన్నారు. ఈ యూనిట్‌కు 120 ఎకరాలు కేటాయించామని చెప్పారు. భారీ రాయితీలు కాకుండా విద్యుత్, నీటి సరఫరా తదితర మౌలిక వసతులు కల్పించే విధంగా సంస్థతో ఒప్పందం చేసుకున్నట్లు మంత్రి వివరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఎక్కడ : అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 21
ఎవరు : ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఎక్కడ : అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్
Published date : 22 Nov 2019 05:59PM