Skip to main content

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రమ్మీపై నిషేధం విధించిన రాష్ట్రం?

సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతోన్న ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
Current Affairs

ఇందుకు సంబంధించి ఏపీ గేమింగ్ యాక్ట్-1974కు చేసిన సవరణలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. వెలగడిపూడిలోని సచివాలయంలో సెప్టెంబర్ 3న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గం ఈ మేరకు పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

రెండేళ్లు జైలు శిక్ష...
ఏపీ గేమింగ్ యాక్ట్-1974కు చేసిన సవరణల ప్రకారం... నిషేధం విధించిన రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లను ఆడేవాళ్లకు ఆరు నెలల జైలు శిక్ష, నిర్వాహకులకు ఏడాది జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. రెండోసారి ఈ తప్పిదానికి పాల్పడితే రెండేళ్లు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు.

మంత్రివర్గం ఇతర నిర్ణయాలు...

  • వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకానికి ఆమోదం.
  • గుంటూరు జిల్లా బాపట్ల మండలం మూలపాలెం, జమ్ములపాలెం గ్రామాల్లో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 51.07 ఎకరాల భూమి కేటాయింపు.
  • ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఏర్పాటుకు అవసరమైన 41.97 ఎకరాల భూమిని కేటాయింపు.
  • పంచాయితీరాజ్ శాఖలో మెరుగైన పాలన కోసం ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు వలంటీర్లు, సచివాలయ వ్యవస్థలో డివిజనల్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ (డీడీవో) పోస్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయం.
  • జాయింట్ కలెక్టర్లకు కింద ఎంపీడీవో (మండల పరిషత్ డెవలప్‌మెంట్ ఆఫీసర్)లకు పైన డిప్యూటీ డెరైక్టర్ కేడర్‌లో డీడీవో పోస్టుల ఏర్పాటు. ఎంపీడీవోలకు పదోన్నతుల ద్వారా డీడీవో పోస్టుల భర్తీ.
  • మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంఘాల మీద మరో ఏడాదిపాటు నిషేధం పొడిగింపు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రమ్మీ, పోకల్ వంటి జూదం, బెట్టింగ్‌లపై నిషేధం విధిస్తూ నిర్ణయం
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : సమాజంలో చెడు ధోరణులకు కారణమవుతున్నందున
Published date : 04 Sep 2020 05:33PM

Photo Stories