అంతర్జాతీయ టీబీ సదస్సులో వెంకయ్య
Sakshi Education
హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో 4 రోజుల పాటు జరగనున్న ‘ఊపిరితిత్తుల ఆరోగ్యం’పై అంతర్జాతీయ సదస్సును ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అక్టోబర్ 30న ప్రారంభించారు.
ఈ సందర్భంగా వెంకయ్య ప్రసంగిస్తూ... దేశం నుంచి క్షయ(టీబీ) వ్యాధిని 2025 నాటికి నిర్మూలించేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని ముందుకు సాగాల్సిన అవసరముందని పిలుపునిచ్చారు. రివైజ్డ్ నేషనల్ టీబీ కంట్రోల్ ప్రోగ్రాం ద్వారా భారత్‌లో టీబీ వ్యాధిగ్రస్తుల శాతం 1.7 శాతానికి తగ్గిందన్నారు. ఇంటర్నేషనల్ యూనియన్ అగినెస్ట్ ట్యూబర్‌కులోసిస్, లంగ్ డిసీజెస్ (ఐయూఏటీబీఎల్డీ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే, ఐయూఏటీబీఎల్డీ అధ్యక్షుడు జెరెమియ్య, 130 దేశాల నుంచి 400 మంది వైద్యులు పాల్గొన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
ఎక్కడ : హెచ్‌ఐసీసీ, హైదరాబాద్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఊపిరితిత్తుల ఆరోగ్యంపై అంతర్జాతీయ సదస్సు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 30
ఎవరు : ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు
ఎక్కడ : హెచ్‌ఐసీసీ, హైదరాబాద్
Published date : 31 Oct 2019 05:32PM