అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సదస్సు
Sakshi Education
పునరుత్పాదక ఇంధనంపై మూడవ అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శనను ప్రధాని నరేంద్రమోదీ నవంబర్ 26వ తేదీన ప్రారంభించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రీ-ఇన్వెస్ట్ 2020 పేరుతో పునరుత్పాదక ఇంధనంపై మూడవ అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శన
ఎప్పుడు : నవంబర్ 26, 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : భారత్‌కు పర్యావరణ సంబంధ పెట్టుబడుల ఆకర్షణ, ప్రోత్సాహం లక్ష్యంగా...
భారత్‌కు పర్యావరణ సంబంధ పెట్టుబడుల ఆకర్షణ, ప్రోత్సాహం లక్ష్యంగా... నవంబర్ 28 వరకు వర్చువల్ విధానంలో ‘‘రీ-ఇన్వెస్ట్ 2020’’పేరుతో ఈ సదస్సును నిర్వహించనున్నారు. ఇంతక్రితం రీ-ఇన్వెస్ట్ సమావేశాలు 2015, 2018 సంవత్సరాల్లో జరిగాయి.
భారత్ లక్ష్యం...
- 2022 నాటికి 175 జీడబ్ల్యూ పునరుత్పాదక సామర్థ్యాన్ని చేరుకోవాలన్నది భారత్ లక్ష్యం. 2030 నాటికి దీనిని 450 గెగావాట్లకు పెంచుకోవాలన్నది భారత్ ప్రయత్నం. ప్రస్తుతం ఈ ఉత్పత్తి 136 గెగావాట్లు.
- గత ఆరేళ్లలో ఈ రంగంలోకి దాదాపు రూ.4.7 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
- 2030 నాటికి ఏడాదికి ఈ రంగంలోకి రూ. లక్ష కోట్ల పెట్టుబడులు రావాలన్న ప్రభుత్వ లక్ష్యం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : రీ-ఇన్వెస్ట్ 2020 పేరుతో పునరుత్పాదక ఇంధనంపై మూడవ అంతర్జాతీయ సదస్సు, ప్రదర్శన
ఎప్పుడు : నవంబర్ 26, 28
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : వర్చువల్ విధానంలో
ఎందుకు : భారత్‌కు పర్యావరణ సంబంధ పెట్టుబడుల ఆకర్షణ, ప్రోత్సాహం లక్ష్యంగా...
Published date : 20 Nov 2020 06:09PM