Skip to main content

అంతర్జాతీయ క్రికెట్‌కు ధోని వీడ్కోలు

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్, టీమిండియాకు చిరస్మరణీయ విజయాలు అందించిన మహేంద్ర సింగ్‌ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
Current Affairs
ఈ విషయాన్ని ఇన్‌స్ట్రగామ్‌ ద్వారా ఆగస్టు 15న ధోని ప్రకటించాడు. జార్ఖండ్ రాజధాని రాంచీలో 1981, జూలై 7న జన్మించిన ధోని 2004 డిసెంబర్‌ 23న తన తొలి వన్డేతో అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించాడు. తన చివరి మ్యాచ్‌ను 2019 ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్లో 2019, జులై 10న ఆడాడు. 2014 డిసెంబర్‌లోనే మిస్టర్ కూల్ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ప్రస్తుతం సైన్యంలో ‘లెఫ్టినెంట్‌ కల్నల్‌’ హోధాలో ధోని ఉన్నాడు.

ఘనతలు, అవార్డులు
  • 2008, 2009లలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు సాధించాడు. వరుసగా రెండేళ్లు ఈ అవార్డు గెల్చుకున్న తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.
  • 2007లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అందుకున్నాడు.
  • 2009లో దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’... 2018లో దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ భూషణ్‌’ అందుకున్నాడు.

ధోని పేరిట ప్రపంచ రికార్డులు...
  • వన్డేల్లో అత్యధికసార్లు నాటౌట్‌గా నిలిచిన ప్లేయర్‌ (84)
  • వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్‌ కీపర్‌ (183 నాటౌట్‌)
  • వన్డేల్లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన కీపర్‌ (123)
  • అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన కీపర్‌ (195)
  • అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కెప్టెన్ గా వ్యవహరించిన క్రికెటర్‌ (332 మ్యాచ్‌లు)
  • టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఒక జట్టుకు అత్యధికంగా ఆరుసార్లు కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక ప్లేయర్‌ (6 సార్లు; 2007, 2009, 2010, 2012, 2014, 2016).

ధోని కెప్టెన్సీ రికార్డు

ఆడిన వన్డేలు: 200
గెలిచినవి: 110
ఓడినవి: 74; టై: 5
ఫలితం రానివి: 11
ఆడిన టెస్టులు: 60
గెలిచినవి: 27
ఓడినవి: 18; డ్రా: 15

ఆడిన టి20లు: 72
గెలిచినవి: 42
ఓడినవి: 28

ధోని అంతర్జాతీయ కేరీర్‌

 

టెస్టు

వన్డే

టి20

మ్యాచ్‌లు

90

350

98

ఇన్నింగ్స్‌

144

287

85

నాటౌట్‌

16

84

42

పరుగులు

4,896

10,773

1,617

అత్యధిక స్కోరు

224

183

56

సగటు

38.09

50.57

3760

స్ట్రయిక్‌రేట్‌

59.11

87.56

126.13

సెంచరీలు

6

10

0

అర్థ సెంచరీలు

33

73

2

ఫోర్లు

544

826

116

సిక్స్‌లు

78

229

52

క్యాచ్‌లు

256

321

123

స్టంపింగ్‌

38

123

34


రనౌట్‌తో మొదలై రనౌట్‌తో ముగించి...
చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్‌తో ఆడిన తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లో ఏడో స్థానంలో బరిలోకి దిగిన ధోని ఒకే ఒక బంతిని ఎదుర్కొని ‘సున్నా’కే రనౌట్‌గా వెనుదిరిగాడు. న్యూజిలాండ్‌తో ఆడిన ఆఖరి వన్డేలో కూడా 50 పరుగులు చేసిన అనంతరం గప్టిల్‌ అద్భుత త్రోకు కెప్టెన్ కూల్ రనౌట్‌ అయ్యాడు.
Published date : 17 Aug 2020 05:53PM

Photo Stories