Skip to main content

అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఏ ఏడాదిని ప్రకటించారు?

2023 సంవత్సరాన్ని ఇంటర్నేషనల్ మిల్లెట్స్ ఇయర్ (అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం)గా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.
Current Affairs
చిరు ధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రపంచ దేశాల్లో అవగాహన కల్పించడం, మారుతున్న వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా చిరు ధాన్యాల సాగుని ప్రోత్సహించడం వంటివి 2023 ఏడాది చేపడతారు.

భారత్‌ తీర్మానం మేరకు...
భారతదేశ తీర్మానం మేరకు 2023ను అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ఐరాస ప్రకటించింది. బంగ్లాదేశ్, కెన్యా, నేపాల్, నైజీరియా, రష్యా, సెనెగల్‌ దేశాలతో కలిపి భారత్‌ ఈ తీర్మానాన్ని తీసుకురాగా మరో 73కి పైగా దేశాలు మద్దతు తెలిపాయి.

ఐక్యరాజ్యసమితి...
  • ప్రధాన కార్యాలయం: న్యూయార్క్‌(అమెరికా)
  • అధికార భాషలు: అరబిక్, చైనీస్, ఇంగ్లీష్, ఫ్రెంచ్, రష్యన్, స్పానిష్‌
  • ప్రస్తుత సెక్రటరీ జనరల్‌: అంటోనియో గుటెర్రెస్‌
  • ఏర్పాటు: 1945, అక్టోబర్‌ 24
  • ప్రస్తుత సభ్యదేశాల సంఖ్య: 193

ఐరాసాలో చివరిగా చేరిన దేశాలు:

189 – తువాలు (సెప్టెంబరు, 2000)
190 – స్విట్జర్లాండ్‌ (సెప్టెంబరు, 2002)
191 – తూర్పు తిమోర్‌ (2006)
192 – మాంటెనెగో (2006)
193 – దక్షిణ సూడాన్‌ (జూలై, 2011)

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం(ఇంటర్నేషనల్‌ మిల్లెట్స్‌ ఇయర్‌)గా 2023
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ఐక్యరాజ్యసమితి
ఎందుకు : చిరు ధాన్యాలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలపై ప్రపంచ దేశాల్లో అవగాహన కల్పించేందుకు
Published date : 05 Mar 2021 05:41PM

Photo Stories