అంతర్జాతీయ ఐపీ సూచీలో భారత్‌కు 36వ స్థానం
Sakshi Education
అంతర్జాతీయ మోథో సంపత్తి హక్కుల (ఐపీ) సూచీలో భారత్ 36వ స్థానంలో నిలిచింది.
అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ) ఫిబ్రవరి 7న ఆవిష్కరించిన ఈ సూచీలో అమెరికా, బ్రిటన్, స్వీడన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాలు మొదటి తొలి ఐదు ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి. 45 ప్రమాణాల ప్రాతిపదికన, 50 ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై విశ్లేషణ ఆధారంగా ఐపీ సూచీని రూపొందించారు. పేటెంట్, ట్రేడ్‌మార్క్, కాపీరైట్, వాణిజ్య రహస్యాల రక్షణ వంటి అంశాలు ఈ 45 ప్రమాణాల్లో ఉన్నాయి. 2018 ఐపీ సూచీలో భారత్ 44వ స్థానం దక్కించుకోగా, తాజాగా ఇది 8 స్థానాలు మెరుగుపడి 36కు చేరింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ మోథో సంపత్తి హక్కుల (ఐపీ) సూచీలో భారత్‌కు 36వ స్థానం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ)
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ మోథో సంపత్తి హక్కుల (ఐపీ) సూచీలో భారత్‌కు 36వ స్థానం
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పాలసీ సెంటర్ (జీఐపీసీ)
Published date : 08 Feb 2019 05:50PM