Skip to main content

అంపైరింగ్ బాధ్యతలకు రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్?

ఆస్ట్రేలియా అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్ జనవరి 28న అంతర్జాతీయ క్రికెట్ అంపైరింగ్ బాధ్యతలకు రిటైర్మెంట్ ప్రకటించాడు.
Current Affairs
2012నుంచి ఐసీసీ ఎలైట్ అంపైర్స్ ప్యానెల్‌లో సభ్యుడిగా ఉన్న ఆయన 15 ఏళ్ల కెరీర్‌లో దాదాపు 200 అంతర్జాతీయ మ్యాచ్‌లకు అంపైర్‌గా వ్యవహరించారు. క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లకు పనిచేసిన ఆయనకు బ్రిస్బేన్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన నాలుగో టెస్టు చివరిది.

తొలి అంపైర్‌గా...
3 వన్డే ప్రపంచకప్‌లు, 3 టి20 ప్రపంచకప్‌లతో పాటు 2 మహిళల టి20 ప్రపంచకప్‌లలో కూడా ఆక్సెన్‌ఫోర్డ్ అంపైర్‌గా వ్యవహరించారు. మైదానంలో బ్యాట్స్‌మన్ షాట్‌ల నుంచి తప్పించుకునేందుకు ఆర్మ్ షీల్డ్’ను ఉపయోగించిన తొలి అంపైర్‌గా ఆయన గుర్తింపు పొందారు. అంపైర్ కాకముందు క్వీన్స్ లాండ్ జట్టుకు 8 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించిన బ్రూస్... ఇకముందు దేశవాళీ మ్యాచ్‌లకు అంపైర్‌గా కొనసాగుతానని స్పష్టం చేశాడు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ర్జాతీయ క్రికెట్ అంపైరింగ్ బాధ్యతలకు రిటైర్మెంట్ ప్రకటన
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ఆస్ట్రేలియా అంపైర్ బ్రూస్ ఆక్సెన్‌ఫోర్డ్
Published date : 01 Feb 2021 06:18PM

Photo Stories