అంగారకుడి కక్ష్యలోకి ప్రవేశించిన చైనా స్పేస్‌క్రాఫ్ట్ పేరు?
Sakshi Education
చైనా ప్రయోగించిన అంతరిక్ష నౌక ‘తియాన్‌వెన్-1’ దాదాపు ఏడు నెలలపాటు ప్రయాణించి, ఫిబ్రవరి 10న అంగారక గ్రహం (మార్స్) కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది.
అంగారక గ్రహంపై వాతావరణ పరిస్థితులు, నీటి జాడను అన్వేషించడానికి, మానవ జీవనానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించేందుకు చైనా ఈ అంతరిక్ష నౌకను ప్రయోగించింది.
కేవలం రెండు రోజుల వ్యవధిలోనే రెండు ఆర్బిటార్లు మార్స్ కక్ష్యలోకి ప్రవేశించడం గమనార్హం. యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) ప్రయోగించిన ‘అమల్’ అనే అంతరిక్ష నౌక ఫిబ్రవరి 9న అరుణ గ్రహ కక్ష్యలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. త్వరలో తన రోవర్ ‘పర్సివరెన్స్’ను అంగారకుడిపైకి ప్రయోగించేందుకు అమెరికా ఏర్పాట్లు పూర్తి చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంగారక గ్రహం (మార్స్) కక్ష్యలోకి చైనా అంతరిక్ష నౌక
ఎప్పుడు : ఫిబ్రవరి 10
ఎవరు : తియాన్‌వెన్-1
ఎందుకు : అంగారక గ్రహంపై వాతావరణ పరిస్థితులు, నీటి జాడను అన్వేషించడానికి, మానవ జీవనానికి గల సాధ్యాసాధ్యాలపై అధ్యయనం నిర్వహించేందుకు

Published date : 11 Feb 2021 05:50PM