అంగారకుడి అంతర్భాగంలో జలవ్యవస్థ
Sakshi Education
అంగార క గ్రహం అంతర్భాగంలో జలవ్యవస్థ ఉందని నెదర్లాండ్‌సకు చెందిన ఉల్ట్రిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు.
అంగారకుడి భూగర్భంలో ఓ భారీ చెరువు ఉన్నట్లు 2018లో యూరోపియన్ అంతరిక్ష సంస్థ గుర్తించింది. తాజాగా నెదర్లాండ్‌స శాస్త్రవేత్తలు అంగారకుడి అంతర్భాగంలో అలాంటి 5 భారీ చెరువులు ఉన్నట్లు తేల్చారు. ఇవన్నీ ఒకదానితో మరొకటి అనుసంధానమై ఉన్నాయని శాస్త్రవేత్త ఫ్రానెస్కో సాలీస్ వివరించారు. తాము అంగారక గ్రహంపై 24 ప్రాంతాలను పరిశీలించామనీ, ఉపరితలానికి 4,000 మీటర్ల లోతున ఏర్పడ్డ ఈ చెరువుల్లో నీరు పుష్కలంగా ఉందని పేర్కొన్నారు.‘జర్నల్ ఆఫ్ జియోఫిజికల్ రీసెర్చ్ ప్లానెట్స్’లో శాస్త్రవేత్తల పరిశోధన ప్రచురితమైంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంగారకుడి అంతర్భాగంలో జలవ్యవస్థ
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : నెదర్లాండ్‌సకు చెందిన ఉల్ట్రిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంగారకుడి అంతర్భాగంలో జలవ్యవస్థ
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : నెదర్లాండ్‌సకు చెందిన ఉల్ట్రిచ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు
Published date : 05 Mar 2019 04:56PM