అంగారక గ్రహం కక్ష్యలోకి యూఏఈ పంపిన అంతరిక్ష నౌక పేరు?
Sakshi Education
యునెటైట్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ‘అమల్’ అనే అంతరిక్ష నౌక ఫిబ్రవరి 9న అంగారక గ్రహ కక్ష్యలోకి ప్రవేశించింది. ఇది అరబ్ దేశాల తొలి గ్రహాంతర ప్రయోగం.
ఈ మానవ రహిత అంతరిక్ష నౌక దాదాపు ఏడు నెలల పాటు 30 కోట్ల మైళ్లు ప్రయాణించి అంగారక గ్రహ కక్ష్యను చేరుకుంది. ఇకపై కక్ష్యలో పరిభ్రమిస్తూ అంగారక గ్రహ వాతావరణం గురించి సమాచారం సేకరిస్తుంది. ప్రయోగం విజయవంతం కావడంతో మిషన్ డెరైక్టర్ ఒమ్రాన్ షరీఫ్ హర్షం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంగారక గ్రహ కక్ష్యలోకి ‘అమల్’ అనే అంతరిక్ష నౌక
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : యునెటైట్ అరబ్ ఎమిరేట్స్
ఎందుకు : అంగారక గ్రహంపై పరిశోధనలు చేసేందుకు
Published date : 10 Feb 2021 06:37PM