ఆంధ్రప్రదేశ్‌లో తొలి పెలైట్ శిక్షణా కేంద్రం ఎక్కడ ఏర్పాటు కానుంది?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి పెలైట్ శిక్షణా కేంద్రం కర్నూలులో ఏర్పాటు కానుంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్ సలహాదారు, ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) ఎండీ వి.ఎన్.భరత్‌రెడ్డి అక్టోబర్ 8న తెలిపారు.
హైదరాబాద్, బెంగళూరు ఎయిర్‌పోర్టులకు దగ్గరగా ఉండటం, కర్నూలు ఎయిర్‌పోర్ట్ అందుబాటులోకి రానుండటంతో ఇక్కడ పెలైట్ శిక్షణా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు పేర్కొన్నారు.
రూ.160 కోట్లతో...
సుమారు 970 ఎకరాల్లో రూ.160 కోట్లతో ఏపీఏడీసీఎల్ కర్నూలు ఎయిర్‌పోర్టును నిర్మించింది. 2 వేల మీటర్ల పొడవు, 30 మీటర్ల వెడల్పుతో రన్‌వేను అభివృద్ధి చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్‌లో తొలి పెలైట్ శిక్షణా కేంద్రం ఏర్పాటు
ఎప్పుడు : అక్టోబర్ 8
ఎవరు : ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్)
ఎక్కడ : కర్నూలు, కర్నూలు జిల్లా

Published date : 09 Oct 2020 05:32PM