Skip to main content

ఆంధ్రప్రదేశ్‌లో నిఘా యాప్ ఆవిష్కరణ

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు రూపొందించిన ‘నిఘా యాప్’ను మార్చి 7న తాడేపల్లిలో క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆవిష్కరించారు.
Current Affairs ఓటర్లకు ఎవరైనా డబ్బులు, మద్యం పంపిణీ చేస్తే ఎన్నికైన తర్వాత కూడా సంబంధిత వ్యక్తులపై అనర్హత వేటుతో పాటు మూడేళ్ల జైలు శిక్ష పడేలే ప్రభుత్వం చట్టంలో మార్పులు చేసిన విషయం విదితమే.

సీఎం జగన్‌తో జర్మనీ కాన్సుల్ జనరల్ భేటీ
సౌర విద్యుత్, పర్యాటకం, జీరో బడ్జెట్ ఫార్మింగ్ వంటి రంగాల్లో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఫెడరల్ రిపబ్లిక్ ఆఫ్ జర్మనీ ఆసక్తి వ్యక్తం చేసింది. జర్మనీ కాన్సుల్ జనరల్ కెరిన్ స్టోల్ మార్చి 9న తాడేపల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 10 వేల మెగా వాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు, విద్యా వ్యవస్థలో అమలు చేస్తున్న సంస్కరణలు, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలను స్టోల్‌కు సీఎం వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : నిఘా యాప్ ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి
ఎక్కడ : సీఎం క్యాంపు కార్యాలయం, తాడేపల్లి
ఎందుకు : స్థానిక సంస్థల ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీని అరికట్టేందుకు
Published date : 10 Mar 2020 09:00PM

Photo Stories