Skip to main content

ఆంధ్రప్రదేశ్‌లో ఇంగ్లిష్ మీడియం తరగతులు

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ, మండల, జిల్లా పరిషత్ పాఠశాలల్లోని అన్ని తరగతులను ఇంగ్లిష్ మీడియంలోకి మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఒకటి నుంచి ఎనిమిది తరగతులను వచ్చే విద్యా సంవత్సరం (2020-21) నుంచి, తొమ్మిదో తరగతిని 2021-22 నుంచి, పదో తరగతిని 2022-23 నుంచి ఇంగ్లిష్ మీడియంలోకి మార్చనున్నట్లు వెల్లడించింది. ఆయా తరగతుల్లో తెలుగు లేదా ఉర్దూను తప్పనిసరి సబ్జెక్టుగా చదవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్ నవంబర్ 5న ఉత్తర్వులు జారీ చేశారు.

మరోవైపు నాడు-నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యా సంస్థలన్నింటిలో దశల వారీగా అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించేందుకు భారీగా వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. 2019, నవంబర్ 14వ తేదీ నుంచి దశల వారీగా స్కూళ్లలో, డిసెంబర్ 26వ తేదీ నుంచి ఆసుపత్రుల్లో నాడు-నేడు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని నవంబర్ 5న చెప్పారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి
: ఆంధ్రప్రదేశ్‌లో 2020-21 నుంచి ఇంగ్లిష్ మీడియం తరగతులు
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
Published date : 06 Nov 2019 05:56PM

Photo Stories