ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎస్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా రాష్ట్ర కేడర్‌కు చెందిన 1987 ఐఏఎస్ బ్యాచ్ అధికారి <b>ఆదిత్యనాథ్ దాస్</b> నియమితులయ్యారు.
ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ డిసెంబర్ 22న ఉత్తర్వులు జారీ చేశారు. 2020, డిసెంబర్ 31వ తేదీన పదవీ విరమణ చేయనున్న ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని స్థానంలో ఆదిత్యనాథ్ బాధ్యతలు చేపట్టనున్నారు.
సాగునీటి శాఖ కార్యదర్శిగా...
ఆదిత్యనాథ్ దాస్ సుదీర్ఘకాలం సాగునీటి శాఖ కార్యదర్శిగా, ముఖ్య కార్యదర్శిగా, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 1999 - 2001 వరకు వరంగల్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 2006 నుంచి 2007 వరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి డెరైక్టర్‌గా విధులు నిర్వర్తించనున్నారు. రాష్ట్ర విభజన అనంతరం 2016 వరకు సాగునీటి శాఖ బాధ్యతలు నిర్వహించారు. అనంతరం విద్యాశాఖ బాధ్యతలు చేపట్టారు. కేంద్ర సర్వీసులో కూడా పలు బాధ్యతలు నిర్వర్తించిన ఆయన ప్రస్తుతం జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌గా ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన సీఎస్‌గా నియమితులైన ఐఏఎస్ అధికారి
ఎప్పుడు : డిసెంబర్ 22
ఎవరు : ఆదిత్యనాథ్ దాస్
ఎందుకు : ప్రస్తుత సీఎస్ నీలం సాహ్ని త్వరలో పదవీ విరమణ చేయనుండటంతో...

Published date : 23 Dec 2020 06:07PM