Skip to main content

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటైంది. ఈ మేరకు డిసెంబర్ 26న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Current Affairsరాష్ట్ర హోంమంత్రి చైర్‌పర్సన్‌గా వ్యవహరించే ఈ కమిషన్‌లో పలువురు కీలక అధికారులతోపాటు ముగ్గురు స్వతంత్ర సభ్యులు ఉంటారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి సమావేశమయ్యే ఈ కమిషన్ పోలీసుల సేవలు, పనితీరును అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తుంది.

భద్రతా కమిషన్ కార్యదర్శిగా హోంశాఖ సెక్రటరీ వ్యవహరిస్తారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు పోలీస్ ఫోర్స్ హెడ్(ఎక్స్-అఫీషియో సెక్రటరీ) ఇందులో ఉంటారు. వీరితోపాటు శాంతిభద్రతల నిర్వహణ, పరిపాలన, మానవ హక్కులు, చట్టం, సామాజిక సేవ, ప్రజా పరిపాలన నిర్వహణ లాంటి విషయాల్లో అనుభవమున్న మరో ముగ్గురిని సభ్యులుగా నియమించాల్సి ఉంది. ఆ మేరకు రిటైర్డ్ ఐపీఎస్‌లు డీటీ నాయక్, గోపీనాథ్‌రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ మన్మోహన్‌సింగ్‌లను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భద్రతా కమిషన్ ఏర్పాటు
ఎప్పుడు : డిసెంబర్ 26
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎందుకు : పోలీసుల సేవలు, పనితీరును అంచనా వేసేందుకు
Published date : 27 Dec 2019 05:34PM

Photo Stories