ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్-2020కి ఆమోదం
Sakshi Education
పశ్చిమగోదావరి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ కోసం రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్-2020కి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సెప్టెంబర్ 3న ఆమోదం తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్-2020కి ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : ఏపీ కేబినెట్
ఎందుకు : పశ్చిమగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం
మత్స్య రంగంలో సమగ్ర అభివృద్ధి కోసం ఏర్పాటు చేయనున్న చేయనున్న ఈ యూనివర్సిటీ కోసం రానున్న ఐదేళ్లలో రూ.300 కోట్ల వ్యయం చేయనున్నారు. ఈ వర్సిటీ ద్వారా రాష్ట్రంలో మత్స్య, ఆక్వా రంగాల్లో సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం.
ఏటా రూ.2,500 కోట్లు నష్టం...
ఆక్వా రంగంలో నిపుణుల కొరత కారణంగా ఏడాదికి సుమారు రూ.2,500 కోట్లు నష్టపోతున్నామని, వర్సిటీ ఏర్పాటు ద్వారా ఆ నష్టాన్ని నివారించవచ్చని అంచనా. తద్వారా సుమారు 90 వేల మంది ఆక్వా రైతులు, దీనిపై ఆధారపడ్డ మరో ఎనిమిది లక్షల మంది ప్రజలు ప్రయోజనం పొందుతారని ఆంచనా.
ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి పచ్చ జెండా..
- ఉత్తరాంధ్రకు గోదావరి జలాలను తరలించి, సస్యశ్యామలం చేయడానికి బాబు జగజ్జీవన్ రామ్ ఉత్తరాంధ్రా సుజల స్రవంతి ప్రాజెక్టు పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- 63.2 టీఎంసీల నీటిని తరలించి.. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సుమారు 8 లక్షల ఎకరాల సాగునీటిని అందించాలని నిర్ణయం. ఈ పథకానికి రూ.15,389.80 కోట్ల వ్యయం అవుతుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఆర్డినెన్స్-2020కి ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : ఏపీ కేబినెట్
ఎందుకు : పశ్చిమగోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం
Published date : 04 Sep 2020 05:42PM