ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సలహాదారుగా నీలం సాహ్ని
Sakshi Education
2020, డిసెంబర్ 31న పదవీ విరమణ చేయనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) నీలం సాహ్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ముఖ్య సలహాదారుగా నియమితులుకానున్నారు.
ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన (రాజకీయ) శాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ డిసెంబర్ 22న ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం... కేబినెట్ ర్యాంకు హోదాలో కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, రాష్ట్ర పునర్విభజన అంశాలు, పరిపాలన సంస్కరణలు, గ్రామ, వార్డు సచివాలయాలు, జిల్లాల పునర్విభజన, ల్యాండ్ సర్వే టైట్లింగ్ చట్టం, కోవిడ్ 19, ఆరోగ్యం తదితర బాధ్యతలను నీలం సాహ్ని నిర్వర్తించనున్నారు.
Published date : 23 Dec 2020 05:45PM