ఆంధ్రప్రదేశ్ ఎస్‌డీసీ కార్పొరేషన్ ఏర్పాటు ఉద్దేశం?
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటు చేస్తూ విడుదల చేసిన జీవో ఎంఎస్ నంబర్ 80కి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సెప్టెంబర్ 3న ఆమోదం తెలిపింది. వంద శాతం ప్రభుత్వ ఆధ్వర్యంలో ‘పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ’గా ఏపీఎస్‌డీసీ ఏర్పాటైంది.
ఏపీఎస్‌డీసీ ఉద్దేశం...
నాడు-నేడు (మనబడి), నాడు-నేడు (వైద్యం), అమ్మ ఒడి, వైఎస్సార్ చేయూత, వైఎస్సార్ ఆసరా, వైఎస్సార్ రైతు భరోసా పథకాల అమలుకు ప్రణాళిక, ఫండింగ్ (నిధుల సమీరణ)తోపాటు సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టుల అమలుకు అవసరమైన ప్రణాళికను ఈ కార్పొరేషన్ రూపొందిస్తుంది.
రహదారుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి...
రహదారుల నిర్మాణం, నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు ఒక రూపాయి చొప్పున రోడ్ సెస్ విధించాలనే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి వర్గం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రోడ్ సెస్ ద్వారా సమకూరే మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ దగ్గర ఉంచాలని నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్‌డీసీ) ఏర్పాటుకు ఆమోదం
ఎప్పుడు : సెప్టెంబర్ 3
ఎవరు : ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం
ఎందుకు : పలు ప్రభుత్వ పథకాల అమలుకు అవసరమైన ప్రణాళిక రూపొందించేందుకు

Published date : 04 Sep 2020 05:36PM