ఆంధ్రప్రదేశ్ ఏజీగా సుబ్రహ్మణ్యం శ్రీరామ్
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ను నియమిస్తూ రాష్ట్ర సీఎస్ ఎల్.వి.సుబ్రహ్మణ్యం జూన్ 4న ఉత్తర్వులు జారీ చేశారు.
జూన్ 5న ఏపీ ఏజీగా శ్రీరామ్ బాధ్యతలు స్వీకరించారు. 1969లో జన్మించిన శ్రీరామ్ 1992 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. అనతి కాలంలోనే రాజ్యాంగపరమైన కేసులతో పాటు, సివిల్ కేసులు, సర్వీసు వివాదాల కేసులు, విద్యా రంగానికి సంబంధించిన కేసుల్లో మంచి పట్టు సాధించారు. 2009 నుంచి 2011 వరకు ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా వ్యవహరించారు. ఇప్పటివరకు ఏపీ ఏజీగా ఉన్న దమ్మాలపాటి శ్రీనివాస్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) నియామకం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : సుబ్రహ్మణ్యం శ్రీరామ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) నియామకం
ఎప్పుడు : జూన్ 4
ఎవరు : సుబ్రహ్మణ్యం శ్రీరామ్
Published date : 05 Jun 2019 05:33PM