ఆంధ్ర రంజీ క్రికెట్‌కు సీనియర్ పేస్ బౌలర్విజయ్ వీడ్కోలు
Sakshi Education
ఆంధ్ర సీనియర్ పేస్ బౌలర్, 33 ఏళ్ల డేవిడ్ పైడికాల్వ విజయ్ కుమార్ క్రికెట్ కెరీర్‌కు వీడ్కోలు పలికాడు.
2006లో బరోడాతో మ్యాచ్ ద్వారా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన విజయ్... హైదరాబాద్‌తో జనవరి 14న ముగిసిన మ్యాచ్‌లో ఆంధ్ర తరఫున రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించాడు. కెరీర్‌లో 71 రంజీ మ్యాచ్‌లు ఆడిన విజయ్ మొత్తం 248 వికెట్లు తీశాడు. షాబుద్దీన్ (75 మ్యాచ్‌ల్లో 242 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును విజయ్ బద్దలు కొట్టాడు. హైదరాబాద్‌తో మ్యాచ్ ముగిశాక విజయ్‌ను ఆంధ్ర క్రికెట్ సంఘం (ఏసీఏ) అధికారులు సన్మానించారు. సహచరులు బ్యాట్‌లు ఎత్తి ‘గార్డ్ ఆఫ్ ఆనర్’తో గౌరవించారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్ర రంజీ క్రికెట్‌కు సీనియర్ పేస్ బౌలర్ విజయ్ వీడ్కోలు
ఎప్పుడు: జనవరి 14, 2020
ఎవరు: పైడికాల్వ విజయ్ కుమార్
క్విక్ రివ్యూ:
ఏమిటి: ఆంధ్ర రంజీ క్రికెట్‌కు సీనియర్ పేస్ బౌలర్ విజయ్ వీడ్కోలు
ఎప్పుడు: జనవరి 14, 2020
ఎవరు: పైడికాల్వ విజయ్ కుమార్
Published date : 16 Jan 2020 04:43PM