అండర్-19 ప్రపంచకప్ విజేత బంగ్లాదేశ్
Sakshi Education
ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2020 విజేతగా బంగ్లాదేశ్ జట్టు నిలిచింది.
దక్షిణాఫ్రికాలోని పాచెఫ్‌స్ట్రూమ్‌లో ఫిబ్రవరి 9న జరిగిన ఫైనల్లో బంగ్లాదేశ్ జట్టు డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో డిఫెండింగ్ చాంపియన్ భారత్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 47.2 ఓవర్లలో 177 పరుగులు చేసింది. 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 42.1 ఓవర్లలో 7 వికెట్లకు 170 పరుగులు చేసి గెలిచింది. 41వ ఓవర్లో వర్షం రావడంతో కొంతసేపు మ్యాచ్ ఆగిపోయింది. అప్పటికి బంగ్లాదేశ్ 163/7 స్కోరుతో ఉంది. వర్షం తగ్గుముఖం పట్టాక బంగ్లాదేశ్ లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 46 ఓవర్లలో 170 పరుగులుగా కుదించారు.
ఈ టోర్నిలో భారత జట్టు కెప్టెన్‌గా ప్రియమ్ గార్గ్, బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్‌గా అక్బర్ అలీ వ్యవహరించారు. అక్బర్ అలీకి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’, యశస్వి జైస్వాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఐసీసీ అండర్-19 క్రికెట్ ప్రపంచకప్ 2020 విజేత
ఎప్పుడు : ఫిబ్రవరి 9
ఎవరు : బంగ్లాదేశ్ జట్టు
ఎక్కడ : పాచెఫ్‌స్ట్రూమ్, దక్షిణాఫ్రికా

Published date : 10 Feb 2020 05:57PM