అంబటి రాయుడు బౌలింగ్‌పై ఐసీసీ నిషేధం
Sakshi Education
అంతర్జాతీయ క్రికెట్‌లో భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు బౌలింగ్ చేయకుండా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిషేధం విధించింది.
ఆస్ట్రేలియాతో జనవరి 12న జరిగిన తొలి వన్డేలో అతని బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందంటూ అంపైర్లు నివేదిక ఇచ్చారు. ఐసీసీ నిబంధనల ప్రకారం రెండు వారాల్లోగా అతను తన బౌలింగ్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. రాయుడు దీనిపై ఆసక్తి చూపించకపోవడంతో నిషేధం వెంటనే అమల్లోకి వస్తున్నట్లు ఐసీసీ జనవరి 28న ప్రకటించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంబటి రాయుడు బౌలింగ్‌పై నిషేధం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)
ఎందుకు : బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంబటి రాయుడు బౌలింగ్‌పై నిషేధం
ఎప్పుడు : జనవరి 28
ఎవరు : ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)
ఎందుకు : బౌలింగ్ శైలి సందేహాస్పదంగా ఉందని
Published date : 29 Jan 2019 05:25PM