అమర్‌నాథ్ యాత్ర రద్దు..!
Sakshi Education
కరోనా విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది కూడా అమర్‌నాథ్ యాత్రను రద్దు చేస్తూ జమ్మూకశ్మీర్ యంత్రాంగం సోమవారం ప్రకటించింది.
కరోనా కారణంగా అమర్‌నాథ్ యాత్ర రద్దు కావడం ఇది రెండోసారి. కరోనా విజృంభిస్తోన్న సమయంలో అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. యాత్రికుల రక్షణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం ఈ విషయాన్ని ట్విటర్‌లో తెలిపింది. వర్చ్యువల్‌లో పూజా కార్యక్రమాలను చూడొచ్చని అమర్‌నాథ్ బోర్డు తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి: అమర్‌నాథ్ యాత్ర రద్దు
ఎప్పుడు: జూన్ 21
ఎవరు ప్రకటించారు : జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం
ఎందుకు : కోవిడ్ 19 ప్రభావంతోక్విక్ రివ్యూ :
ఏమిటి: అమర్‌నాథ్ యాత్ర రద్దు
ఎప్పుడు: జూన్ 21
ఎవరు ప్రకటించారు : జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయం
Published date : 22 Jun 2021 04:53PM