Skip to main content

అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత

అమర్‌నాథ్ యాత్రను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఆగస్టు 2న అనూహ్య ప్రకటన చేసింది.
పాకిస్తాన్‌లోని ఉగ్రవాదులు అమర్‌నాథ్ యాత్ర లక్ష్యంగా దాడి చేసేందుకు ఆ దేశ ఆర్మీ సహాయంతో కుట్రలు పన్నుతున్నారని కచ్చితమైన సమాచారం వచ్చినట్లు భారత ఆర్మీ హెచ్చరించింది. యాత్ర సాగే మార్గాల్లో ఆయుధాలు, పేలుడు పదార్థాలను సైన్యం గుర్తించింది. దీంతో యాత్రికులు, పర్యాటకులు కశ్మీర్ నుంచి ఉన్నపళంగా వెనక్కు వెళ్లిపోవాలని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం సూచించింది. జూలై 1న మొదలైన అమర్‌నాథ్ యాత్ర ఆగస్టు 15న ముగియాల్సి ఉంది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌లో గవర్నర్ పాలన నడుస్తుండటం తెలిసిందే.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అమర్‌నాథ్ యాత్ర నిలిపివేత
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం
ఎందుకు : ఉగ్రదాడి జరిగే అవకాశం ఉండటంతో
Published date : 03 Aug 2019 05:50PM

Photo Stories