అమరావతిలో వెంకటేశ్వరస్వామి ఆలయానికి భూకర్షణం
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి (గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటాపురం)లో శ్రీవెంకటేశ్వరస్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూకర్షణం, బీజావాపన కార్యక్రమం నిర్వహించారు.
జనవరి 31న జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాల్గొన్నారు. దేవాలయానికి కేటాయించిన 25 ఎకరాల భూమిని ఉచితంగా, ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జీలు తీసుకోకుండా ఇస్తున్నట్టు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. రెండున్నరేళ్లలో ఆలయ నిర్మాణాన్ని పూర్తిచేయాలని ఆదేశించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీవెంకటేశ్వరస్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూకర్షణం
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయడు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : శ్రీవెంకటేశ్వరస్వామి నూతన ఆలయ నిర్మాణానికి భూకర్షణం
ఎప్పుడు : జనవరి 31
ఎవరు : ఏపీ సీఎం చంద్రబాబు నాయడు
ఎక్కడ : అమరావతి, ఆంధ్రప్రదేశ్
Published date : 01 Feb 2019 05:10PM