Skip to main content

అమల్లోకి పీఎస్‌యూ బ్యాంకుల విలీనం

ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకుల భారీ విలీనం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది.

Current Affairs


దీంతో ఆంధ్రా బ్యాంకు సహా ఆరు బ్యాంకులు కనుమరుగు కానున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగే భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో కేంద్రం.. ప్రభుత్వ రంగంలో బ్యాంకుల విలీనానికి తెరతీసిన సంగతి తెలిసిందే. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ)లో ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్, యునైటెడ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విలీనమవుతాయి. అలాగే కెనరా బ్యాంకులో సిండికేట్‌ బ్యాంకు .. యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో ఆంధ్రా బ్యాంకు, కార్పొరేషన్‌ బ్యాంకు .. ఇండియన్‌ బ్యాంకులో అలహాబాద్‌ బ్యాంకు విలీనమవుతాయి. పీఎన్‌బీ, యూనియన్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంకు, ఇండియన్‌ బ్యాంకు .. యాంకర్‌ బ్యాంకులుగా ఉంటాయి.


రెండో అతి పెద్ద బ్యాంకుగా పీఎన్‌బీ...

తాజా విలీనంతో ప్రభుత్వ రంగంలో 7 భారీ బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు ఉంటాయి. ఒక్కో భారీ బ్యాంకు పరిమాణం రూ. 8 లక్షల కోట్ల పైగా ఉండనుంది. ప్రభుత్వ రంగంలో ఎస్‌బీఐ తర్వాత రెండో అతి పెద్ద బ్యాంకుగా పీఎన్‌బీ ఆవిర్భవిస్తుంది. కెనరా బ్యాంక్‌ నాలుగో స్థానంలో, యూనియన్‌ బ్యాంక్‌ (5), ఇండియన్‌ బ్యాంక్‌ ఏడో అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఉంటాయి. 2017లో 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) ఉండగా ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకులను, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో మరికొన్ని బ్యాంకులను విలీనం చేయగా 18కి తగ్గాయి. ఇకపై 12 మాత్రమే ఉండనున్నాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అమల్లోకి పీఎస్‌యూ బ్యాంకుల విలీనం
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : అంతర్జాతీయ స్థాయిలో పోటీపడగలిగే భారీ బ్యాంకులను ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో
Published date : 02 Apr 2020 12:30PM

Photo Stories