అమెరికన్ సీహాక్ హెలికాప్టర్ల కొనుగోలుకు ఆమోదం
Sakshi Education
అమెరికా నుంచి 24 మల్టీ-రోల్ ఎంహెచ్-60 సీహాక్ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలు చేయడానికి కేబినెట్ కమిటీ ఆఫ్ సెక్యూరిటీ (సిసిఎస్) ఫిబ్రవరి 19న ఆమోదం తెలిపింది.
2.4 బిలియన్ డాలర్లతో కొనుగోలు చేయనున్న ఈ హెలికాప్టర్లు ప్రస్తుతం భారత్ వినియోగిస్తున్న సీకింగ్ హెలికాప్టర్ల స్థానాన్ని భర్తీ చేయనున్నాయి. ఈ హెలికప్టర్లతో భారత్ నావికా దళ సామర్థ్యం మరింత పెరుగునుంది.
సీహాక్ హెలికాప్టర్ల ప్రత్యేకతలు
ఏమిటి : అమెరికన్ మల్టీ-రోల్ ఎంహెచ్-60 సీహాక్ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : భారత నావికా దళ సామర్థ్యాన్ని పెంచేందుకు
సీహాక్ హెలికాప్టర్ల ప్రత్యేకతలు
- ఈ హెలికాప్లర్లను ముఖ్యంగా సబ్‌మెరైన్‌లను ధ్వంసం చేసేందుకు ఉపయోగిస్తారు.
- వీటిలో సబ్‌మెరైన్‌ను ధ్వంసం చేసేందుకు యాంటీ సబ్‌మెరైన్ టార్పెడోలు ఉంటారుు.
- అత్యాధునిక రాడార్ సెన్సార్లును కలిగి ఉన్నాయి. ఇవి నావిక దళం రాడార్ పరిమితిని దాటి శత్రు సబ్‌మెరైన్ లొకేషన్‌ని పసిగట్టడానికి ఉపయోగపడతారుు.
- హెవీ లిఫ్ట్ హెలీకాప్టర్ కావడం వల్ల బలమైన యుద్ధ యంత్రాలను మోయగలదు.
- సముద్రం ఒడ్డున అమర్చే ఆయుధ వ్యవస్థలను వీటి సాయంతో ధ్వంసం చేయవచ్చు.
ఏమిటి : అమెరికన్ మల్టీ-రోల్ ఎంహెచ్-60 సీహాక్ (రోమియో) హెలికాప్టర్లను కొనుగోలుకు ఆమోదం
ఎప్పుడు : ఫిబ్రవరి 19
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : భారత నావికా దళ సామర్థ్యాన్ని పెంచేందుకు
Published date : 21 Feb 2020 05:47PM