Skip to main content

అమెరికాలో భారత రాయబారిగా తరణ్‌జీత్

న్యూఢిల్లీ: అమెరికాలో భారత రాయబారిగా తరణ్‌జిత్ సంధు నియమితులయ్యారు. 1988 బ్యాచ్ ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారి (ఐఎఫ్‌ఎస్) అయిన సంధు గతంలో రెండు పర్యాయాలు అమెరికాలో భారత్ తరపున 2013-2017 మధ్య డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా పనిచేశారు.
Current Affairsఇప్పటివరకూ అమెరికాలో భారత రాయబారిగా ఉన్న హర్షవర్ధన్ ష్రింగ్లా విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా నియమితులవడంతో ఆ స్థానంలో సంధు బాధ్యతలు చేపడతారు. సంధు ప్రస్తుతం శ్రీలంకలో భారత హైకమిషనర్‌గా ఉన్నారు. కాగా, భారత్‌లో సీఏఏ, కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370ను అమెరికన్ కాంగ్రెస్ విమర్శిస్తున్న తరుణంలో సంధు నియామకం ప్రాధాన్యం సంతరించుకొంది.

క్విక్ రివ్యూ:
ఏమిటి:
అమెరికాలో భారత రాయబారిగా తరణ్‌జీత్ నియమాకం
ఎవరు: తరణ్‌జీత్
ఎక్కడ: అమెరికా
Published date : 30 Jan 2020 06:06PM

Photo Stories