అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళ కన్నుమూత?
Sakshi Education
అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రూత్ బాడర్ గిన్స్ బర్గ్(87) కన్నుమూశారు.
గత కొన్నేళ్లుగా పాన్‌క్రియాటిక్ కేన్సర్‌తో పోరాడుతున్న ఆమె న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో సెప్టెంబర్ 18న తుదిశ్వాస విడిచారు. బ్రూక్లిన్‌లో యూదు వలసదారులకు చెందిన సాధారణ కుటుంబంలో 1933, మార్చి 15న జన్మించిన రూత్ హార్వార్డ్ యూనివర్సిటీలో లా చదివారు. మహిళా హక్కుల కోసం, సామాజిక న్యాయం, లింగ సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన ఆమె అమెరికా సుప్రీంకోర్టులో జడ్జి అయిన రెండో మహిళగా రికార్డులకెక్కారు. 1993లో అప్పటి అధ్యక్షుడు, డెమొక్రాటిక్ నాయకుడు బిల్ క్లింటన్ ఆమెను సుప్రీం జడ్జిగా నియమించారు.
అధ్యక్షుడికే...
అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని నియమించే సర్వాధికారాలను అప్పగించింది. ఒకసారి న్యాయమూర్తి నియామకం జరిగితే వారు జీవితాంతం ఆ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజే)గా జాన్ రాబర్‌ట్స ఉన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా సుప్రీంకోర్టు న్యాయమూర్తి కన్నుమూత
ఎప్పుడు : సెప్టెంబర్ 18
ఎవరు : జస్టిస్ రూత్ బాడర్ గిన్స్ బర్గ్(87)
ఎక్కడ : బ్రూక్లిన్, న్యూయార్క్, అమెరికా
ఎందుకు : పాన్‌క్రియాటిక్ కేన్సర్ కారణంగా

Published date : 21 Sep 2020 05:34PM