అమెరికా రక్షణ మంత్రిగా నియమితులైన నల్లజాతీయుడు?
Sakshi Education
అమెరికా రక్షణ మంత్రిగా రిటైర్డ్ జనరల్ అస్టిన్ నియమితులయ్యారు. దీంతో అమెరికా రక్షణ మంత్రి పదవి చేపట్టిన తొలి నల్లజాతీయుడిగా అస్టిన్ నిలిచారు.
అమెరికా కాంగ్రెస్‌లోని ఎగువ సభ అయిన సెనేట్... రక్షణ మంత్రిగా అస్టిన్ నామినేషన్‌ను జనవరి 22న రికార్డు స్థాయిలో 93-2 ఓట్ల తేడాతో బలపరిచింది. ఆ వెంటనే ఆయన చేత ప్రస్తుతం అమెరికా బలగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న డెరైక్టర్ టామ్ మూయిర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆ వెను వెంటనే అస్టిన్ విధుల్లో చేరారు.
మరోవైపు అమెరికా అధ్యక్షుడు జో బెడైన్ విదేశాలతో సంబంధాలపై దృష్టి సారించారు. విదేశీ నేతల్లో తొలిసారిగా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ఫోన్ చేసి మాట్లాడారు. కరోనాపై కలసికట్టుగా పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాల బలోపేతానికి చర్యలు తీసుకోవాలన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా రక్షణ మంత్రిగా నియమితులైన నల్లజాతీయుడు
ఎప్పుడు : జనవరి 22
ఎవరు : రిటైర్డ్ జనరల్ అస్టిన్

Published date : 25 Jan 2021 06:34PM