అమెరికా నుంచి 72400 రైఫిల్స్ కొనుగోలు
Sakshi Education
అమెరికా రక్షణ రంగ సంస్థ సిగ్ సార్ నుంచి 72,400 అధునాతన రైఫిళ్లు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు భారత రక్షణ శాఖ అధికారులు ఫిబ్రవరి 12న వెల్లడించారు.
ఇందుకోసం ఇందుకోసం రూ.700 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపారు. అమెరికా, యూరప్ దేశాల సైనికులు వినియోగిస్తున్న ఆ రైఫిళ్లను ఫాస్ట్‌ట్రాక్ విధానంలో కొనుగోలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా సిగ్ సార్ నుంచి ఏడాది వ్యవధిలో 72,400 7.62 ఎంఎం రైఫిల్స్ భారత సైన్యానికి అందుతాయి.పస్తుతం భారత సైనికులు 5.56x45 ఎంఎం ఇన్‌సాస్ రైఫిల్స్‌ను వాడుతున్నారు. ఈ ఆయుధాలను చైనా సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందికి అందించనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : సిగ్ సార్ సంస్థ నుంచి 72,400 అధునాతన రైఫిళ్లు కొనుగోలు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : భారత రక్షణ శాఖ
క్విక్ రివ్యూ :
ఏమిటి : సిగ్ సార్ సంస్థ నుంచి 72,400 అధునాతన రైఫిళ్లు కొనుగోలు
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : భారత రక్షణ శాఖ
Published date : 13 Feb 2019 04:48PM