Skip to main content

అమెరికా-మెక్సికో సరిహద్దు గోడకు ఆమోదం

అమెరికా-మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి 1 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 6,900 కోట్లు) నిధులను విడుదల చేసేందుకు పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం) మార్చి 26న ఆమోదం తెలిపింది.
దీంతో అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండానే సైనిక నిధులతో గోడ నిర్మించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు అవకాశం కలిగింది. అమెరికా-మెక్సికో సరిహద్దులో 92 కిలోమీటర్ల పొడవు, 18 అడుగుల ఎత్తులో ఈ గోడను నిర్మించనున్నారు. ఈ గోడ నిర్మాణానికి 5.7 బిలియన్ డాలర్ల నిధులు కావాలని అమెరికా కాంగ్రెస్‌లో ట్రంప్ బిల్లును ప్రవేశపెట్టగా ఈ బిల్లు తిరస్కరణకు గురైంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అమెరికా-మెక్సికో సరిహద్దు గోడకు ఆమోదం
ఎప్పుడు : మార్చి 26
ఎవరు : పెంటగాన్ (అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం)
ఎక్కడ : అమెరికా
Published date : 27 Mar 2019 04:36PM

Photo Stories