అమెరికా క్రికెట్ జట్టు కోచ్‌గా అరుణ్ కుమార్
Sakshi Education
ఐపీఎల్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు బ్యాటింగ్ కోచ్‌గా పనిచేసిన కర్ణాటక మాజీ క్రికెటర్ జె.అరుణ్ కుమార్ అమెరికా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఎంపికయ్యాడు.
కరోనా అదుపులోకి రాకపోతే ఒలింపిక్స్ జరగవు
వచ్చే ఏడాదివరకల్లా కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోతే టోక్యో ఒలింపిక్స్‌ను మళ్లీ వాయిదా వేసే ప్రసక్తే లేదని... వాటిని రద్దు చేస్తామని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ యొషిరో మోరి తెలిపారు. జపాన్‌కు చెందిన క్రీడాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోరి మాట్లాడుతూ.. మహమ్మారి అదుపులోకి రాకపోతే తిరిగి 2022కు వాయిదా వేసే ప్రణాళిక ఏదీ లేదని, టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయడం తప్పదని అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఎంపిక
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : కర్ణాటక మాజీ క్రికెటర్ జె.అరుణ్ కుమార్
ఏడాది క్రితం అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి అమెరికాకు వన్డే హోదా లభించింది. భవిష్యత్‌లో అమెరికాకు టెస్టు హోదా అందించడమే తన సుదీర్ఘ లక్ష్యమని 45 ఏళ్ల అరుణ్ కుమార్ వ్యాఖ్యానించాడు. అరుణ్ కోచ్‌గా ఉన్న సమయంలోనే కర్ణాటక జట్టు 2013–14; 2014–15 సీజన్‌లలో రంజీ ట్రోఫీ, విజయ్ హజారే ట్రోఫీ, ఇరానీ కప్ టైటిల్స్ నెగ్గి అరుదైన ‘ట్రిపుల్’ ఘనత సాధించింది.
కరోనా అదుపులోకి రాకపోతే ఒలింపిక్స్ జరగవు
వచ్చే ఏడాదివరకల్లా కరోనా మహమ్మారి అదుపులోకి రాకపోతే టోక్యో ఒలింపిక్స్‌ను మళ్లీ వాయిదా వేసే ప్రసక్తే లేదని... వాటిని రద్దు చేస్తామని ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ యొషిరో మోరి తెలిపారు. జపాన్‌కు చెందిన క్రీడాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోరి మాట్లాడుతూ.. మహమ్మారి అదుపులోకి రాకపోతే తిరిగి 2022కు వాయిదా వేసే ప్రణాళిక ఏదీ లేదని, టోక్యో ఒలింపిక్స్‌ను రద్దు చేయడం తప్పదని అన్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికా క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా ఎంపిక
ఎప్పుడు : ఏప్రిల్ 28
ఎవరు : కర్ణాటక మాజీ క్రికెటర్ జె.అరుణ్ కుమార్
Published date : 29 Apr 2020 08:46PM