అమెరికా ఎన్‌ఎస్‌ఎఫ్ డెరైక్టర్‌గా సేతురామన్
Sakshi Education
అమెరికా నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్‌ఎస్‌ఎఫ్) డెరైక్టర్‌గా భారత సంతతి శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్‌ను ఎంపిక చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఎఫ్ డెరైక్టర్‌గా ఫ్రాన్స్ కార్డోవా ఉన్నారు. 2020, ఏడాది ఆమె పదవీకాలం ముగిశాక సేతురామన్ బాధ్యతలు స్వీకరించనున్నారు. అమెరికా ప్రభుత్వ సంస్థ అయిన ఎన్‌ఎస్‌ఎఫ్ సైన్స్, ఇంజనీరింగ్‌లోని నాన్-మెడికల్ అంశాల్లో పరిశోధనలు, విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తుంది.
తమిళనాడుకు చెందిన సేతురామన్ ప్రస్తుతం ఆరిజోనా స్టేట్ విశ్వవిద్యాలయంలో ముఖ్య పరిశోధనాధికారిగా పనిచేస్తున్నారు. ఆయన 1984లో బెంగళూరు ఐఐఎస్‌సీ నుంచి ఎలక్టాన్రిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందారు. ఆ తర్వాత మద్రాస్ ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మాస్టర్స్ డిగ్రీ, అనంతరం కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్ అట్టావాలో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ సైన్స్ లో పీహెచ్‌డీ పూర్తిచేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఎన్‌ఎస్‌ఎఫ్ డెరైక్టర్‌గా నియామకం
ఎప్పుడు : డిసెంబర్ 20
ఎవరు : భారత సంతతి శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్

Published date : 21 Dec 2019 05:57PM