అమెరికా డ్రోన్‌ను కూల్చిన ఇరాన్
Sakshi Education
తమ భూభాగంలోకి చొచ్చుకువచ్చిన అమెరికాకు చెందిన ఒక నిఘా డ్రోన్‌ను కూల్చివేసినట్టు ఇరాన్ వెల్లడించింది.

తమ దేశ గగనతలంలోకి ప్రవేశించిన మానవరహిత, ఆయుధరహిత ఆర్‌క్యూ 4ఏ నిఘా డ్రోన్‌ను కూల్చేసినట్టు పేర్కొంది. డ్రోన్ కూల్చివేత విషయమై అమెరికా స్పందిస్తూ హార్మోజ్‌గాన్ ప్రావిన్స్ వరకు ఆ డ్రోన్ వెళ్లిందని అది అంతర్జాతీయ గగనతలమని తెలిపింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాది క్రితం ఇరాన్‌తో అణు ఒప్పందం వెనక్కి తీసుకున్నప్పట్నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికాకి చెందిన ఆర్‌క్యూ 4ఏ నిఘా డ్రోన్ కూల్చివేత
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : ఇరాన్
ఎందుకు : తమ దేశ గగనతలంలోకి ప్రవేశించినందున
క్విక్ రివ్యూ :
ఏమిటి : అమెరికాకి చెందిన ఆర్‌క్యూ 4ఏ నిఘా డ్రోన్ కూల్చివేత
ఎప్పుడు : జూన్ 20
ఎవరు : ఇరాన్
ఎందుకు : తమ దేశ గగనతలంలోకి ప్రవేశించినందున
Published date : 21 Jun 2019 05:19PM