Skip to main content

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ప్రధాని మోదీ చ‌ర్చలు

ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా వైరస్ క‌ట్టడిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏప్రిల్ 4న ఫోన్ లో చ‌ర్చించారు.
Current Affairs

కరోనాపై యుద్ధం చేయడానికి పరస్పరం సహకరించుకోవాలని ఇరు దేశాలు స‌హ‌క‌రించుకోవాల‌ని మోదీ, ట్రంప్ నిర్ణయించారు. ప్రపంచ దేశాల్లో ఆరోగ్య అత్యవసర పరిస్థితి నెలకొన్న ఈ సమయంలో ప్రజల శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగ, ఆయుర్వేద వైద్య విధానం ప్రాముఖ్యతపైన కూడా ఇద్దరు నేతలు చర్చించారు. కోవిడ్‌–19 రోగులకు ఇచ్చే హైడ్రాక్సీ క్లోరోక్విన్ మందుల్ని అమెరికా పంపించాల‌ని మోదీని ట్రంప్ కోరారు.


క్లోరోక్విన్‌పై నిషేధం

మలేరియా వ్యాధిని అరికట్టే క్లోరోక్విన్‌ టాబ్లెట్లు కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో సత్ఫలితాలు చూపిస్తున్నాయని భావిస్తూ ఉండడంతో అమెరికా కొన్నాళ్ల క్రితమే భారత్‌కి ఆర్డర్‌ పెట్టుకుంది. భారత్‌లో కూడా కరోనా కేసులు ఎక్కువ కావడంతో క్లోరోక్విన్‌ ఎగుమతుల్ని ఏప్రిల్ 4న భారత్‌ నిషేధించింది. దీంతో ట్రంప్‌ ఫోన్‌ చేసి మోదీతో మాట్లాడారు. తమ కంపెనీలు ఆర్డర్‌ చేసిన క్లోరోక్విన్‌ మాత్రల్ని పంపాలని విజ్ఞప్తి చేశారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో ఫోన్ లో చ‌ర్చలు
ఎప్పుడు : ఏప్రిల్ 4
ఎవరు : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎందుకు : క‌రోనా వైర‌స్ క‌ట్టడిపై చ‌ర్చించేందుకు
Published date : 06 Apr 2020 06:21PM

Photo Stories