అల్టిమా గ్రహం దగ్గరగా న్యూ హారిజాన్
Sakshi Education
సౌర కుటుంబంలో దాదాపు చివరన ఉన్న ‘అల్టిమా టూలే’అనే గ్రహానికి దగ్గరగా నాసాకి చెందిన న్యూ హారిజాన్ అంతరిక్ష నౌక ప్రయాణించింది.
ఈ మేరకు జనవరి 1న నాసా తెలిపింది. ఇప్పటివరకు ఏ అంతరిక్ష నౌక చేరని, దూరాన్ని న్యూహారిజాన్ ఛేదించిందని వివరించింది. అల్టిమా అన్ని గ్రహాల మాదిరిగా కాకుండా సూర్యుడి చుట్టూ దాదాపు వృత్తాకార కక్ష్యలో తిరుగుతోందని పేర్కొంది.
అల్టిమా గ్రహం సూర్యుడికి దాదాపు 400 కోట్ల మైళ్ల దూరంలో ఉన్న నెప్ట్యూన్‌కు ఆవల మన సౌర వ్యవస్థలోని క్యూపర్ బెల్టులో ఉంది. ఈ గ్రహం అసలు పేరు 2014 ఎంయూ69 అయితే అల్టిమా టూలే అని పిలుచుకుంటున్నారు. లాటిన్‌లో అల్టిమా టూలే అంటే మన ప్రపంచానికి చాలా దూరం అని అర్థం.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అల్టిమా గ్రహం దగ్గరగా న్యూ హారిజాన్
ఎప్పుడు : జనవరి 1
ఎవరు : నాసా

Published date : 02 Jan 2019 05:48PM