Skip to main content

ఆల్ప్స్‌ పర్వతశ్రేణుల్లో భారత జాతీయ పతాకం

కరోనాపై పోరులో భారత్‌కు స్విట్జర్లాండ్‌ వినూత్న రీతిలో సంఘీభావం తెలిపింది.
Current Affairs

భారతీయుల్లో విశ్వాసం పాదుకొల్పి, నైతిక స్థైర్యం అందించేందుకు ప్రఖ్యాత ఆల్ప్స్‌ పర్వతశ్రేణుల్లో ఒకటైన మాటర్‌హార్న్‌ పర్వతంపై ఇలా మువ్వన్నెల కాంతులను ప్రసరింపజేసింది. స్విస్‌ కళాకారుడు గెర్రీ హాఫ్స్‌టెటర్‌ 4,478 మీటర్ల ఎత్తైన మాటర్‌హార్న్‌ పర్వత శిఖరంపై భారత జాతీయ పతాకంతో కూడిన కాంతులను ప్రసరింపజేశారు. స్విస్‌ సంఘీభావంపై ప్రధాని మోదీ ఏప్రిల్ 18న ట్విట్టర్‌లో స్పందించారు. కరోనాపై యావత్‌ ప్రపంచం కలసికట్టుగా పోరాడుతోందని, ఈ మహమ్మారిపై మానవజాతి విజయం సాధించి తీరుతుందని ట్వీట్‌ చేశారు.


అక్టోబర్‌ నాటికి వ్యాక్సిన్‌: ఆక్స్‌ఫర్డ్‌

2020, మే నెల‌లోపు 500 మందిపై కోవిడ్‌ వ్యాక్సిన్‌ను ప్రయోగించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ వ్యాక్సినోలజీ ప్రొఫెసర్ సారా గిల్బర్ట్‌ వెల్లడించారు. 18– 55 ఏళ్ల వారిని ఈ ప్రయోగం కోసం ఎంపిక చేసి, ప్రాథమికంగా పరీక్షించ‌నున్నారు. 2020 అక్టోబర్‌ నాటికి అన్నీ అనుకూలిస్తే ఈ పరిశోధనల ద్వారా మంచి ఫలితాలు రావొచ్చనీ, భారీస్థాయిలో వ్యాక్సిన్‌ను తయారుచేసే సామర్థ్యాన్ని సాధిస్తామని గిల్బర్ట్ తెలిపారు. యూనివర్సిటీ ఆఫ్‌ ఆక్స్‌ఫర్డ్‌లో 1994 నుంచి గిల్బర్ట్‌ వ్యాక్సిన్లపై అధ్యయనం చేస్తున్నారు. నావెల్‌ కరోనా వైరస్‌కి వ్యాక్సిన్‌ పరిశోధనకు గిల్బర్ట్‌కి, బ్రిటన్‌కి చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ రీసెర్చ్, యూకే రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సంస్థలు మార్చిలో 28 లక్షల డాలర్ల గ్రాంటుగా ఇచ్చాయి. ఇమ్యునైజేషన్‌ దశ నుంచి క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు వచ్చిన ప్రయోగాల్లో గిల్బర్ట్‌ బృందం ప్రయోగం మొదటిది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఆల్ప్స్‌ పర్వతశ్రేణుల్లో భారత జాతీయ పతాకం
ఎప్పుడు : ఏప్రిల్ 18
ఎవరు : స్విస్‌ కళాకారుడు గెర్రీ హాఫ్స్‌టెటర్‌
ఎక్కడ : మాటర్‌హార్న్‌ పర్వతం, ఆల్ప్స్‌ పర్వతశ్రేణులు
ఎందుకు : కరోనాపై పోరులో భారత్‌కు వినూత్న రీతిలో సంఘీభావం
Published date : 20 Apr 2020 07:08PM

Photo Stories