ఆలిండియా పోలీస్ వేడుకల్లో ఉపరాష్ట్రపతి
Sakshi Education
సికింద్రాబాద్‌లోని రైల్వే స్పోర్‌ట్స కాంప్లెక్స్ (ఆర్‌ఎస్‌సీ) గ్రౌండ్‌సలో ఫిబ్రవరి 23న 20వ ఆలిండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ ముగింపు వేడుకలను నిర్వహించారు.
ఈ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొని ప్రసంగించారు. సంగీతం సాయుధ దళాలలో ధైర్యాన్ని, శౌర్యాన్ని రేకెత్తిస్తుందని వెంకయ్య పేర్కొన్నారు. దేశభక్తిని, దేశ రక్షణపై నిబద్ధతను ప్రేరేపిస్తుందన్నారు. ఆలిండియా పోలీస్ బ్యాండ్ ఛాంపియన్‌షిప్ పోటీలను ఆర్‌పీఎఫ్ జాతీయ స్థాయిలో 3వసారి నిర్వహిస్తోందని రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డెరైక్టర్ జనరల్ అరుణ్‌కుమార్ అన్నారు.
సీఆర్‌పీఎఫ్‌కు విజేత ట్రోఫి
తాజా వేడుకల్లో బ్రాస్ బ్యాండ్ క్యాటగిరీలో 20వ ఆల్ ఇండియా పోలీస్ బ్యాండ్ ఛాంపియన్‌షిప్ విజేత ట్రోఫీని సీఆర్‌పీఎఫ్‌కు, పైప్ బ్యాండ్ ట్రోఫీని మహారాష్ట్ర పోలీసులకు అందజేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆలిండియా పోలీస్ బ్యాండ్ కాంపిటీషన్ 20వ ముగింపు
ఎప్పుడు : ఫిబ్రవరి 23
ఎవరు : ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : ఆర్‌ఎస్‌సీ గ్రౌండ్‌స, సికింద్రాబాద్

Published date : 24 Feb 2020 06:11PM