Skip to main content

అలీనోద్యమ దేశాల సదస్సులో వెంకయ్య

18వ అలీనోద్యమ దేశాల సదస్సులో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు.
‘నేటి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు - బాన్‌డుంగ్(ఇండోనేషియా) సూత్రాలు అమలు’ అనే ఇతివృత్తంతో అజర్‌బైజాన్ రాజధాని బాకులో అక్టోబర్ 25, 26 తేదీల్లో ఈ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సు సందర్భంగా వెంకయ్య మాట్లాడుతూ... భారతదేశంలో అస్థిరతను, అశాంతిని రెచ్చగొట్టేందుకు పాకిస్తాన్ కుటిల యత్నాలు చేస్తోందన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పులు, వ్యాధులు, ఆర్థిక సంక్షోభాలు, సైబర్ నేరాలు విస్తరిస్తున్న నేపథ్యంలో అలీన దేశాలన్నీ నిర్మాణాత్మక చర్యలతో ముందడుగేయాలన్నారు. భారత్ ఉద్దేశ్యాలు, లక్ష్యాలను సభ్య దేశాలకు వెంకయ్య వివరించారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
18వ అలీనోద్యమ దేశాల సదస్సు
ఎప్పుడు : అక్టోబర్ 25
ఎవరు : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
ఎక్కడ : బాకు, అజర్‌బైజాన్
Published date : 26 Oct 2019 05:56PM

Photo Stories