అల్‌హార్తికి మాన్ బుకర్ బహుమతి
Sakshi Education
సాహిత్యరంగంలో అందించే ప్రఖ్యాత మాన్‌బుకర్ ప్రైజ్ 2019కిగానూ ఓ అరబ్ మహిళను వరించింది.

ఒమన్‌కు చెందిన రచయిత్రి జోఖా అల్‌హార్తి(40) రాసిన ‘సెలస్టియల్ బాడీ’ నవలకు ఈసారి మాన్ బుకర్ ప్రైజ్ దక్కింది. లండన్‌లోని రౌండ్‌హౌస్‌లో బుకర్‌ప్రైజ్‌ను అందుకున్న అల్‌హార్తి.. ఈ అవార్డును గెలుచుకున్న తొలి అరబ్ మహిళగా చరిత్ర సృష్టించారు. బ్రిటన్ నుంచి 1951లో స్వాతంత్య్రం పొందాక ఒమన్‌లో చోటుచేసుకున్న మార్పులను, బానిసత్వం పరిస్థితులను ఈ నవలలో అల్‌హార్తి వర్ణించారు. ఈ అవార్డు కింద అందే రూ.44.60 లక్షల(64,000 డాలర్ల)ను అల్‌హార్తి, అనువాదకురాలు మార్లిన్ చెరిసగం పంచుకోనున్నారు.
క్విక్ రివ్యూ:
ఏమిటి: అల్‌హార్తికి మాన్ బుకర్ బహుమతి ప్రదానం
ఎవరు: అల్‌హార్తి
ఎందుకు: ‘సెలస్టియల్ బాడీ’ నవలకు
ఎక్కడ: లండన్
క్విక్ రివ్యూ:
ఏమిటి: అల్‌హార్తికి మాన్ బుకర్ బహుమతి ప్రదానం
ఎవరు: అల్‌హార్తి
ఎందుకు: ‘సెలస్టియల్ బాడీ’ నవలకు
ఎక్కడ: లండన్
Published date : 24 May 2019 06:23PM