అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించండి
Sakshi Education
అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎస్.ఎన్.శుక్లాను తొలగించాలని కోరుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ప్రధాని మోదీకి జూన్ 23న లేఖ రాశారు.
మెడికల్ కాలేజీలకు అనుమతులిచ్చే విషయంలో ముడుపులు అందుకున్నారని జస్టిస్ శుక్లాపై ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. వీటిపై విచారణ జరిపేందుకు మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఇందిరా బెనర్జీ, సిక్కిం హైకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్‌కే అగ్నిహోత్రి, మధ్యప్రదేశ్ హైకోర్టు జస్టిస్ పీకే జైస్వాల్ నేతృత్వంలో త్రిసభ్య అంతర్గత కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ శుక్లాపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని తేల్చింది. దీంతో శుక్లాను విధుల నుంచి తొలగించండని గొగోయ్ ప్రధానిని కోరారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించండి
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
ఎందుకు : అవినీతికి పాల్పడినందుకు
క్విక్ రివ్యూ :
ఏమిటి : అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించండి
ఎప్పుడు : జూన్ 23
ఎవరు : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్
ఎందుకు : అవినీతికి పాల్పడినందుకు
Published date : 24 Jun 2019 06:34PM