అలెక్సిస్ బాక్సింగ్ టోర్నిలో స్వర్ణ పతకాలు సాధించిన భారత బాక్సర్లు?
Sakshi Education
ఫ్రాన్స్ లోని నాంటెస్ నగరం వేదికగా అక్టోబర్ 27 నుంచి 31 వరకు జరిగిన అలెక్సిస్ వాస్టిన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్‌లో భారత బాక్సర్లు అమిత్ పంఘాల్ (52 కేజీలు), సంజీత్ (91 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు) పసిడి పతకాలతో మెరిశారు.
ఫైనల్ పోరుల్లో అమిత్ 3-0తో రెనె అబ్రహం (అమెరికా)పై... సోహెబ్ బౌఫియా (అమెరికా)పై సంజీత్ గెలుపొందారు. 75 కేజీల విభాగంలో జోసెఫ్ జెరోమ్ హిక్స్ (అమెరికా)తో ఆశిష్ కుమార్ తలపడాల్సి ఉండగా... గాయం కారణంగా జోసెఫ్ వైదొలిగాడు.
కవీందర్‌కు రజతం...
57 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశ ఎదురైంది. ఫైనల్ బౌట్‌లో కవీందర్ సింగ్ బిష్త్ 1-2తో సామ్యుల్ కిష్టోరి (ఫ్రాన్స్) చేతిలో ఓడి రజత పతకంతో సరిపెట్టుకున్నాడు. ఇతర భారత బాక్సర్లలో శివ థాపా (63 కేజీలు), సుమీత్ సంగ్వాన్ (81 కేజీలు), సతీశ్ కుమార్ (+91 కేజీలు) కాంస్య పతకాలు సాధించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : అలెక్సిస్ వాస్టిన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నిలో స్వర్ణం నెగ్గిన భారతీయలు
ఎవరు : అమిత్ పంఘాల్ (52 కేజీలు), సంజీత్ (91 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు)
ఎక్కడ : నాంటెస్, ఫ్రాన్స్

Published date : 02 Nov 2020 06:02PM