ఆల్బేనియాలో భారీ భూకంపం
Sakshi Education
ఐరోపా దేశం ఆల్బేనియాలో భారీ భూకంపం సంభవించింది.
నవంబర్ 26న ఉదయం 4 గంటలకు (స్థానిక కాలమానం) సంభవించిన ఈ భూకంపం కారణంగా 20 మంది మృతి చెందడంతో పాటు 600 మందికి పైగా గాయపడ్డారు. అలాగే పలు భవనాలు కూలినట్లు అధికారులు వెల్లడించారు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. ఆల్బేనియా రాజధాని తిరానాకు 30 కిలోమీటర్ల దూరంలో 20 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించింది. ఆల్బేనియాతోపాటు కొసావో, మోంటెనెగ్రో, గ్రీస్, దక్షిణ సెర్బియాలోని మరికొన్ని ప్రాంతాల్లోనూ భూకంప ప్రభావం కనిపించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూకంపం కారణంగా 20 మంది మృతి
ఎప్పుడు : నవంబర్ 26
ఎక్కడ : తిరానా, ఆల్బేనియా
క్విక్ రివ్యూ :
ఏమిటి : భూకంపం కారణంగా 20 మంది మృతి
ఎప్పుడు : నవంబర్ 26
ఎక్కడ : తిరానా, ఆల్బేనియా
Published date : 27 Nov 2019 05:41PM