ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కి కేబినెట్ ఆమోదం
Sakshi Education
2006లో రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్ -2006 కు సవరణలు చేస్తూ రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలి నవంబర్ 5న ఆమోదం తెలిపింది.
తద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఉత్పతులు అందుబాటులో ఉంటాయి. ఆక్వా రైతులకు నాణ్యమైన ఫిష్ ఫీడ్ అందించేందుకు రూపొందించిన ఆంధ్రప్రదేశ్ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్టు -2020ని కూడా కేబినెట్ ఆమోదించింది.
గ్రామాల్లో బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు...
సహకార రంగంలో మహిళల స్వావలంబనకు రూ.1,362.22 కోట్లతో సమగ్ర ప్రాజెక్టును రూపొందించినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వెల్లడించారు. 500 లీటర్ల కన్నా ఎక్కువ పాల సేకరణ జరిగే 9,899 గ్రామాల్లో బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. పాల ఉత్పత్తి కేంద్రాలు ఆర్‌బీకేకు అనుసంధానంగా పనిచేస్తాయని తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆంధ్రప్రదేశ్ ఆక్వా కల్చర్ సీడ్ యాక్ట్-2020కి ఆమోదం
ఎప్పుడు : నవంబర్ 5
ఎవరు : ఏపీ కేబినెట్
ఎందుకు : ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్, మెరుగైన ఆర్థిక ప్రయోజనాలు కల్పించడంతో పాటు, వినియోగదారులకు నాణ్యతతో కూడిన ఉత్పతులు అందుబాటులో ఉంటాయని

Published date : 06 Nov 2020 06:01PM