Skip to main content

అక్టోబర్ 19 నుంచి బుద్దిస్ట్ రైలు ప్రారంభం

భారత్, నేపాల్‌లో ఉన్న బుద్ధునికి సంబంధించిన చారిత్రక ప్రదేశాలను సందర్శించేలా భారతీయ రైల్వే మొదటిసారిగా ‘బుద్దిస్ట్ సర్క్యూట్’రైలును నడపనుంది.
2019, అక్టోబర్ 19 నుంచి 26 వరకు ఈ రైలు పరుగులు తీయనుందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. బుద్ధుడు జన్మించిన లుంబిని, అతడు జ్ఞానోదయం పొందిన బోధ్‌గయ, మొదటి ఉపన్యాసం చేసిన సారనాథ్, బుద్ధుడు నిర్యాణం పొందిన కుషినగర్ తదితర ప్రాంతాలను ఈ ప్యాకేజీలో భాగంగా సందర్శించవచ్చని పేర్కొంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అక్టోబర్ 19 నుంచి బుద్దిస్ట్ సర్క్యూట్’రైలు ప్రారంభం
ఎప్పుడు : అక్టోబర్ 16
ఎవరు : భారతీయ రైల్వే
Published date : 17 Oct 2019 05:49PM

Photo Stories