Skip to main content

ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ ప్రయోగాలు పునఃప్రారంభం

కోవిడ్-19 కట్టడికి అతిపెద్ద ఔషధ కంపెనీ ఆస్ట్రాజెనెకాతో కలిసి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ రూపొందిస్తున్న ChAdOx1 nCoV&19 వ్యాక్సిన్ ప్రయోగాలు పునఃప్రారంభం అయ్యాయి.
Current Affairs
ఈ ట్రయల్స్ సురక్షితమని మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్‌ఆర్‌ఏ) నిర్థారించడంతో ప్రయోగాలను పునఃప్రారంభించినట్లు ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ సెప్టెంబర్ 12న తెలిపాయి. భారత్‌లో ఆస్ట్రాజెనెకా క్లీనికల్ ట్రయల్స్‌ను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి పొందాక పునఃప్రారంభించినట్లు సీరమ్ ఇనిస్టిట్యూట్ పేర్కొంది.

చదవండి: ఆక్స్‌ఫర్డ్ టీకా ప్రయోగాలకు విరామం

జంతువులపై కోవాగ్జిన్ సత్ఫలితాలు
కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా తయారు చేస్తున్న ‘కోవాగ్జిన్’ టీకా జంతువులపై జరిపిన ప్రయోగాల్లో మంచి ఫలితాలు చూపిందని భారత్ బయోటెక్ వెల్లడించింది. కోతులపై జరిపిన ప్రయోగాల్లో వాటి శరీరాల్లో బలమైన వ్యాధినిరోధకత కనిపించినట్లు తెలిపింది. దీనివల్ల ప్రైమేట్ జీవుల్లో వ్యాధి నిరోధకత పెంచే విషయంలో అంచనాలు మరింత మెరుగయ్యాయని వివరించింది.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ChAdOx1 nCoV&19 వ్యాక్సిన్ ప్రయోగాలు పునఃప్రారంభం
ఎప్పుడు : సెప్టెంబర్ 12
ఎవరు : ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
ఎక్కడ : బ్రిటన్
ఎందుకు : కోవిడ్-19 నివారణకు
Published date : 19 Sep 2020 11:48AM

Photo Stories