ఆక్స్‌ఫర్డ్ నిఘంటువులోకి చడ్డీస్
Sakshi Education
ప్రఖ్యాత ఆక్స్‌ఫర్డ్ తన ఇంగ్లిష్ నిఘంటువులోకి కొత్తగా ఇండియన్ ఇంగ్లిష్‌లో వాడే చడ్డీస్ (లో దుస్తులు) అనే పదాన్ని చేర్చింది.
చడ్డీస్ పదానికి ఆక్స్‌ఫర్డ్ నిఘంటువు పొట్టి ట్రౌజర్లు, అండర్‌వేర్ అనే అర్థాన్ని ఇచ్చింది. బ్రిటిష్ ఇండియన్ నటులు మీరా స్యాల్, సంజీవ్ భాస్కర్‌ల ‘గుడ్‌నెస్ గ్రేసియస్ మి’ అనే ధారావాహిక ద్వారా ఈ పదం ప్రాచుర్యం పొందింది. 1990ల్లో బీబీసీలో ‘గుడ్‌నెస్ గ్రేసియస్ మి’ ధారావాహిక ప్రసారమైంది. మరొకొన్ని ఇతర పదాలను ఆక్స్‌ఫర్డ్ తన డిక్షనరీలో చేర్చింది. వాటిలో ఎక్కువగా స్కాట్లాండ్, వేల్స్‌ల్లో వాడే స్థానిక పదాలున్నాయి. మొత్తం 650 పదాలను కొత్తగా ఆక్స్‌ఫర్డ్ తన డిక్షనరీలో చేర్చింది.
Published date : 22 Mar 2019 04:43PM